ఎన్నికల జోస్యం :  పీకే కు అంత సీన్ లేదా ? దొరికిపోయాడుగా

ఏపీలో ఎన్నికల( Elections In AP ) ఫలితాలు ఏ విధంగా వెలువడబోతున్నాయి అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తున్నాయి .

ఒకవైపు టిడిపి , జనసేన , బిజెపిలు( TDP, Janasena, BJP ) ఏపీలో అధికారం తమదే అన్న ధీమాతో ఉండగా , వైసిపి కూడా మళ్లీ తామే అధికారంలోకి రాబోతున్నామని ,ఈసారి గతం కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంటామని ధీమా గా చెబుతోంది.

అయితే ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు ఉండవని,  ఎవరు అధికారంలోకి వచ్చినా,  బొటాబోటి మెజారిటీతోనే అధికారాన్ని చేపడుతారనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.

ఇది ఎలా ఉంటే ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని , కూటమి అధికారంలోకి వస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేశారు .

ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వైసిపి స్పందించి ఆయనపై విమర్శలు చేయగా , టిడిపి,  జనసేన , బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

"""/" / ఇటీవల ఐ పాక్ టీం తో ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )సమావేశమైన సమయంలో,  గెలుపు పై జగన్ ధీమాను వ్యక్తం చేయగా,  దీనికి ప్రశాంతి కిషోర్ కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూకు ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఎన్నికల ఫలితాల అంచనాల పై కరణ్ థాఫర్ ప్రశ్నించారు.

  హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని , తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని గతంలో పీకే చెప్పిన అంశాలను ఆయన గుర్తు చేశారు.

  దీనిపై ప్రశాంత్ కిషోర్ అసహనం వ్యక్తం చేశారు.తాను అలా చెప్పినట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు .

ఎవరో రాసుకున్న దానికి తాను బాధ్యుడిని కాదని సమాధానం చెప్పారు. """/" / ఎన్నికల ఫలితాలు జోస్యం పై అంత ధీమాగా ఎలా చెప్పగలరని కరణ్ ప్రశ్నించగా , ఈ విషయాన్ని వదిలేసి మరో ప్రశ్న వేయాలంటూ పీకే సమాధానం దాటవేశారు.

ఈ వ్యాఖ్యలు తో ఏపీలో ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం పై అనుమానాలు మొదలయ్యాయి .

గత కొంతకాలంగా టిడిపి నేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారని, ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆయన అంచనాలు తలకిందులు అవుతాయ ని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పడ్డ చోటే లేవాలనుకుంటున్న లెజెండ్ శరవణన్.. మారిన ఈ హీరోకు సక్సెస్ దక్కుతుందా?