స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎన్నిక
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation ) కార్యదర్శిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోదురుపాక ఫిజికల్ డైరెక్టర్ నర్రా శ్రీనివాసరెడ్డి(Narra Srinivasa Reddy ) ని నామినేటెడ్ గా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయలు ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబేద్కర్ నగర్ సిరిసిల్లలో సోమవారం జిల్లా విద్యాధికారి అధ్యక్షతన జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సమావేశంలో నర్ర శ్రీనివాస్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొదురుపాక,బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District ) ని ఎస్ జి ఎఫ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ మండల స్థాయి, జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి ఉమ్మడి జిల్లా స్థాయి పంపే క్రీడాకారులను ఎంపిక చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఎస్ జి ఎఫ్ సెక్రటరీగా ఎన్నికైన నర్ర శ్రీనివాసరెడ్డి ని, డీఈఓ రమేష్ కుమార్ ని సన్మానించారు.
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొలాస మల్లేశం, డివైఎస్ఓ అజ్మీరా రామ్ దాస్, వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నా.
అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..