వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎన్నిక
TeluguStop.com
వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎన్నికయ్యారు.వేములవాడ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మార్చి 7న గురువారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది.
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు అదనపు కలెక్టర్ పూజరి గౌతమి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించారు.
వేములవాడ మున్సిపాలిటీలోని 28 వార్డు సభ్యులు, ఎక్స్ ఆఫీసు సభ్యులైన ఎమ్మెల్యే మొత్తం 29 మంది హాజరయ్యారు.
బింగి మహేష్ వైస్ చైర్మన్ కావడానికి మద్దతుగా అసమ్మతి బిఆర్ఎస్ కౌన్సిలర్ లు యాచమనేని శ్రీనివాస్ రావు, రెండో వార్డు సభ్యులు జయ జడల శ్రీలక్ష్మి ముప్పిడి సునందనల మద్దతుతో పాటు బిజెపి కాంగ్రెస్ సభ్యుల మద్దతు, ఎక్స్ ఆఫిసియో సభ్యులైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మద్దతు తెలపడంతో మొత్తం 29 (28 కౌన్సిలర్లు, 1 ఎక్స్ ఆఫిసియో) మందిలో 18 మంది మద్దతు తెలుపడంతో బింగి మహేష్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు.
1936లో రూ.2,700కే షెవర్లే కారు.. అప్పటి ధరలు వింటే దిమ్మతిరిగిపోతుంది..!