ఏపీలో అప్పుడే మొదలైపోయిన ఎలక్షన్ హవా..!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక సమరానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం గడువు ఉంది.అయితే ఎన్నికల మూడ్ మాత్రం ప్రజల్లో, పార్టీల్లో మొదలయిపోయిందనే చెప్పాలి.

ఎంతో బలంగా ఉన్న వైసీపీ సైతం వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

అలాగే పూర్వ వైభవం కోసం టిడిపి, తన సత్తాను నిరూపించుకోవడానికి జనసేన కూడా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

ఇంకా వీరిలో గెలుపు గుర్రం ఎవరు ఎక్కుతారు అనే విషయం చూడాలి.ఎన్నికల రిజల్ట్ కంటే కూడా ఎవరు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న విషయంలోనే ఆసక్తి నెలకొంది.

అధికార పార్టీ చేపట్టిన పథకాలు ఒక సెక్షన్ ప్రజలకు నప్పాయి కానీ నిరుద్యోగం, రాష్ట్రం నిండా అప్పులు, అలాగే పథకాలకు తప్పించి రాష్ట్రంలో సంక్షేమం లేకపోవడం, ఇండస్ట్రీలు, కంపెనీలు, ఐటీ సెక్టార్ ఇలా వేటిలో కూడా వారు తమ ఉనికిని చాటుకోలేకపోయారు.

మూడు రాజధానుల వ్యవహారం అయితే కచ్చితంగా ఎన్నికల్లో బిడిసి కొట్టే ప్రమాదం ఉంది.

మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన మొదలు పెట్టేశారు.తమ్ముళ్ళని కదిలించడం స్టార్ట్ అయిపోయింది కూడా.

లోకేష్ కూడా పాదయాత్ర ప్రారంభించడానికి రెడీ అయిపోయాడు.చంద్రబాబు తరువాత బస్సు యాత్ర చేస్తారన్న ప్రచారం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంక వైసీపీతో సమానంగా ప్రతిపక్షం కూడా దూకుడు పెంచేసింది.విచిత్రంగా ఎప్పుడూ చివర్లో పోరులోకి ఎంటర్ అయ్యే పవన్ కళ్యాణ్ వారాహితో జనసేన వాగ్ధాటి వినిపిస్తున్నారు.

"""/"/ ముఖ్యంగా వైసిపి నాయకులపై ఆయన సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న తీరు, అభిమానులను పెద్ద ఎత్తున సమయత్తం చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరి టిడిపి జనసేన పొత్తు అవకాశాలను కూడా కొట్టి పారేయలేము.ఏదైనా రాబోయే ఎన్నికలు రెండు పార్టీలకి చావోరేవో అన్న పరిస్థితిగా తయారైతే మరొకరికి మాత్రం రాష్ట్రంలో తమ అధిపత్యాన్ని నువ్వు ఇంత బలోపేతం చేసుకోవడానికి అవకాశంగా చూస్తుంది.

అలాగే వచ్చే ఏడాది నాలుగు నెలల్లో మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి.

కానీ ఎక్కడా లేని హవా ఏపీలోనే కనిపించడం గమనార్హం.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?