టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం( AP Elections )లో ప్రధాన పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.

పార్టీల నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu ) ఎట్టి పరిస్థితులలో ఎన్నికలలో విజయం సాధించాలని భావిస్తున్నారు.

దీంతో ఎట్టి పరిస్థితులలో ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడటం జరిగింది.

బీజేపీ జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు.2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయగ విజయం సాధించడం జరిగింది.

"""/"/ ఇప్పుడు కూడా అదే రీతిలో విజయం సాధించాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో "ప్రజాగళం"( Prajagalam ) పేరిట చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా చంద్రబాబుకి ఎన్నికల కమిషన్( Election Commission ) నోటీసులు జారీ చేసింది.

ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది.

సీఎం జగన్( CM Jagan ) పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు కంప్లెంట్ చేశారు.

దీంతో బాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ.48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

2024 ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని విషయాలను శ్రద్ధగా గమనిస్తూ ఉంది.

ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎవరైనా అధికారుల శ్రద్ధగా పనిచేసిన వెంటనే ఈసీ చర్యలు చేపడుతుంది.

నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?