మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్..!!

ఏపీలోని మాచర్ల( Macherla)లో చోటు చేసుకున్న ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.

ఈ మేరకు రాష్ట్ర సీఈవోకు సీఈసీ నోటీసులు పంపింది.కాగా పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ ఇవ్వాలని సీఈవోను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.

ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని సీఈసీ ప్రశ్నించింది.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా అని నిలదీసింది.

నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా ? అని ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పింది.అదేవిధంగా ఘటనపై సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిపై దాడికి పాల్పడిన టీచర్.. వీడియో వైరల్ కావడంతో?