నల్గొండ జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్
TeluguStop.com
నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.మునుగోడు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయితే, నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది.
మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో 70 శాతం వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ వెనుక కారణాలివేనా.. ఈ లుక్ లో బాగున్నారంటూ?