వైరల్: యువకుడి గానానికి చిందులేసిన వృద్ధుడు… నవ్వాపుకోలేరు!

వయస్సు మా శరీరానికే, మనసుకి కాదని పలువురు పెద్దలు అనేక సందర్భాల్లో రుజువు చేశారు.

తాజాగా ఓ వృద్ధుడు( Old Man ) ముంబై లోని లోకల్ ట్రైన్లో( Mumbai Local Train ) జబర్దస్త్ గా డ్యాన్స్ చేస్తూ ఈ నానుడిని మరోమారు నిజం చేసాడు.

దాంతో దానికి సంబందించిన క్యూట్ వీడియో లక్షలాది మందిని ఆకర్షిస్తోంది.ఓ వృద్ధుడు ‘ఓ మేరే దిల్ కే చైన్’ పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

కొన్ని సెకన్ల నిడివిగల ఈ క్లిప్ ఆహుతులను బాగా అలరిస్తోంది.వైరల్ అవుతున్న వీడియోలో, ముంబై లోకల్ ట్రైన్ లో చాలా మంది పెద్దలు సీట్లలో కూర్చున్నారు.

ట్రైన్ రద్దీగా ఉండడంతో కొంతమంది నిలబడి ప్రయాణిస్తున్నారు. """/" / ఇంతలో గుంపులో నుండి ఒక యువకుడు ‘ఓ మేరే దిల్ కే చైన్’ పాట పాడటం మొదలు పెట్టాడు.

అప్పుడు ఆ యువకుడి పాటకు మరికొన్ని గొంతులు జతకలిశాయి.దాంతో అక్కడే వున్న ఒక పెద్దాయన డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.

అప్పడు తోటి ప్రయాణీకులు కూడా డ్యాన్స్ చేయమంటూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.పాట పాడిన యువకుడి పేరు శశాంక్ పాండే.

( Sashank Panday ) ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.

‘లోకల్ ట్రైన్లో ప్రయాణం చేయడానికి కొట్టుకుంటారు' అని ఎవరు చెప్పారు అనే క్యాప్షన్‌ జత చేశాడు.

శశాంక్ ఓ గాయకుడు, పాటల రచయిత, లైవ్ సింగర్, మరియు నటుడు.అంతేకాదు శశాంక్ తనను తాను గిన్నిస్ రికార్డ్ హోల్డర్‌గా కూడా పేర్కొన్నాడు.

"""/" / జూన్ 1న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 107 వేలకు పైగా లైక్‌లను సంపాదించింది.

ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.నేను ఇలాంటి అందమైన ప్రయాణంలో ఎందుకు భాగం కాలేకపోయాను అని ఒకరు కామెంట్ చేస్తే, ఇక్కడ ఆట పాటలతో ఉచితంగా చికిత్సను కూడా అందిస్తున్నారని మరికొందరు, తాను యువకుడిగా ఉన్న సమయంలో చేసిన ట్రైన్ ప్రయాణం గురించి ఒకాయన రాసుకొచ్చాడు.

మొత్తానికి ట్రైన్ పయనం అనేది కొన్ని అనుభూతుల అంకురం అని చాలామంది ఇక్కడ అభిప్రాయపడడం చూడవచ్చు.