ఓపెన్ జిమ్‌లో వృద్ధ దంపతులు వ్యాయామం.. మలి వయసులోనూ ప్రేమపక్షుల్లా!

సోషల్ మీడియా విస్తృతి బాగా పెరగడంతో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

అందులో ఎక్కువగా ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని గొలిపేవిగా ఉంటాయి.ఇంకొన్ని చూస్తే వింతగానూ.

మరికొన్ని చూస్తే చాలా విడ్డురంగా అనిపిస్తూ ఉంటాయి.అయితే ఈ క్రమంలో కొన్ని కొన్ని వీడియోలు చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపిస్తూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా కొన్ని మానవ సంబంధాలు చూసినపుడు ఇంకా ప్రేమ చచ్చిపోలేదు అనిపిస్తుంటుంది.

అవును, ప్రేమకు వయసుతో పనేంటి.ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే, వృద్ధాప్యంలో కూడా లవ్‌ బర్డ్స్ లా జీవితాన్ని హాయిగా ఆస్వాదించొచ్చు అని ఓ వృద్ధ జంట నిరూపించారు.

కాగా దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక్కడ వీడియోని ఒక్కసారి గమనిస్తే ఓ వృద్ధ జంట పార్క్‌లో ఎంజాయ్ చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేయగా వెలుగు చూసింది. """/"/ విషయం ఏమంటే ఓ ఓపెన్ జిమ్‌కి వృద్ధ దంపతులు వ్యాయామం కొరకు వచ్చారు.

ఆ పెద్దాయన ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఓ మెషీన్‌పై అటు వైపు తన భార్యను కూర్చోబెట్టి కిందకు పైకి ఊపుతూ వ్యాయామం చేయడం గమనించవచ్చు.

కాగా సదరు పార్క్‌కి వచ్చిన మరో వ్యక్తి ఇదంతా గమనించి చక్కగా వీడియో తీశాడు.

దాంతో అది వైరల్ అయిపోయింది.ఇప్పటికి ఆ వీడియో 30 లక్షల మంది వీక్షించగా 5 లక్షల మంది లైక్‌ చేసారు.

"మీరెప్పుడూ ఇలాగే అందంగా, ఆనందంగా ఉండాలి.గాడ్ బ్లెస్ యూ" అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు