ప్రభుత్వ వృద్దుల సంరక్షణ కేంద్రంలో చేర్పించవచ్చు…
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి లో నిర్మిస్తున్న ప్రభుత్వ వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం సందర్శించారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.పడక గదులు, భోజనశాల, వంటగది, సరుకులు నిలువచేయుగది, ఫిజియోథెరపీ రూమ్, వస్తువులు, డాక్టర్ రూమ్ ఆటలు పాటలు రూమ్ టీవీ రూమ్ అన్నింటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే మొక్కల పెంపకం గార్డెనింగ్ పరిశీలించారు.వయవృద్ధుల సంరక్షణ కేంద్రంలోకి రావడానికి ఇష్టపడుతున్నటువంటి వయోవృద్ధులను చేర్చుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మి రాజం కు సూచించారు.
చుట్టుపక్కల పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని మండల పరిషత్ అభివృద్ధిని అధికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన వివాదాలు ఇవే.. వివాదాలకు చెక్ పడినట్టేనా?