ఏకగ్రీవాలు బెడిసి కొట్టాయ్.. రీజనేంటి ? వైసీపీలో అంతర్మథనం
TeluguStop.com
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ పెట్టుకున్న అంచనాలు ఏమిటి? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమిటి? ఆది నుంచి పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ పట్టుబట్టారు.
మరీ ముఖ్యంగా ఈ బాధ్యతలను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలపై ఉంచారు.
వారు కూడా క్షేత్రస్థాయిలో ఇదే ఆదేశాలు ఇచ్చారు.కనీసం 30శాతం పంచాయతీలను ఏకగ్రీవాలు చేయాలని పట్టుబట్టారు.
కానీ, ఇప్పుడు తొలి దశ ముగిసింది.రెండో దశకు ముహూర్తం రెడీ అయింది.
అయితే తొలిదశలో కేవలం 536 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.వాస్తవానికి 2696 గ్రామ పంచాయతీలకు తొలి దశలో ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలు కనీసం వెయ్యికిపైగా జరుగుతాయని అంచనా వేసుకున్నారు.
దీనికి భిన్నంగా ఇప్పుడు 525 మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.ఇక, ఇప్పుడు రెండో దశలో 539 మాత్రమే ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
దీంతో 2786 పంచాయతీలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఇప్పుడు ఇదే.
అధికార వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.ఆది నుంచి తాము ఏకగ్రీవాలకు పట్టుబడుతున్నా భారీ ఎత్తున పారితోషికాలు ప్రకటించినా ఎందుకు ఇలా జరిగిందనేది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
మరి ఎందుకిలా జరిగింది? క్షేత్రస్థాయిలో జరిగిన లోపాలు ఏంటి? ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇదీ ఇప్పుడు వైసీపీని వేదిస్తున్న ప్రశ్న.
మరీ ముఖ్యంగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన తర్వాత వారు ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతను కట్టబెట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏకగ్రీవాలను ఎందుకు సాధించలేక పోయారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం నిర్లక్ష్యం రెండూ పొడచూపాయనేది ప్రాథమికంగా తేలిన విషయం.
"""/"/
ఇప్పటి వరకు పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు బాధ్యత అప్పగిస్తే ఎలా? అనే ప్రశ్న ఎమ్మెల్యేల్లో కనిపించింది.
అదే ఇప్పుడు వైసీపీకి ఏకగ్రీవాలను తగ్గించదనే విశ్లేషణ కొనసాగింది.మరోవైపు ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధించిన ఆంక్షలతో మంత్రులు పర్యటించలేదు.
దీంతో ఎమ్మెల్యేలు సైతం ఎక్కడ కేసులు పెడతారో అనే కోణంలో గ్రామాలకు దూరంగా ఉన్నారు.
వెరసి మొత్తంగా వైసీపీ పెట్టుకున్న ఏకగ్రీవ లక్ష్యం నీరుగారిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?