ధరణిని రద్దు అయినా చేయండి లేకుంటే లోపాలనైనా సరి చేయండి

సూర్యాపేట జిల్లా:ధరణి పోర్టల్ మొత్తం అవకతవకలతో లోపభూయిష్టంగా వున్నదని,ధరణిలో తమ భూములు నమోదు కాక చాలా మంది రైతులు ఇబ్బంది పడుచున్నారని, కాబట్టి ధరణినైనా రద్దు చేయండి లేకుంటే లోపాలనైనా సరి చేయండని సిపిఐ గరడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గరిడేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దార్ కార్తీక్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాతల తండ్రుల నుండి సంక్రమించి,అనేక సంవత్సరాలుగా సాగు చేస్తూ,కబ్జాలో వున్న భూములు వారి పేరుమీద కాకుండా వేరే వాళ్ల పేరుతో నమోదై వున్నాయని, పాత పహాణిలలో ఉండి, పాత పట్టాదారు పాస్ బుక్స్ ఉండి కూడా ఏమిచేయలేని నిస్సాహాయ స్థితిలో రైతులు వున్నారని అవేదన వ్యక్తం చేశారు.

భూమిలేని వారికి ధరణి పాసుబుక్స్ వచ్చి రైతుబంధు పైసలు తీసుకుంటుంటే, భూములు వున్న రైతులు ఉసూరుమంటూ దిక్కులు చూస్తున్నారని అన్నారు.

ధరణి లొసుగులు సరిచేసే అధికారం మండల తహసీల్దార్లకు ఇచ్చి,వారు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలన చేసి,నిజానిజాలను తెలుసుకొని,పాత రికార్డులు కూడా పరిశీలించి,ప్రస్తుతం సాగులో వున్న వారికి భూమిపై హక్కులను కల్పించి కొత్త పట్టాదార్ పాసుబుక్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జొన్నలగడ్డ తిరపయ్య, జాల మహేష్,నంద్యాల లింగారెడ్డి,చిక్కుల్ల సైదులు,రాచమళ్ళ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…