ఎన్నికై ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క పైసా నిధులు తేలేదు: మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
TeluguStop.com
నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికై ఎనిమిది నెలలు అవుతున్నా నేటికీ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కపైసా నిధులు తేలేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.
50 కోట్లు,
మండల అభివృద్ధికి రూ.25 కొట్ల జిహెచ్ఎంసి నిధులు తీసుకువచ్చి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.
ఆ పనులు కూడా పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ నిలిపివేయడం సమంజసం కాదన్నారు.అభివృద్ధిని గాలికొదిలేసి,రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??