బాహబలి సమోసా.. ఎన్ని కిలోలు, ఎంత పెద్దగా ఉందో తెలుసా?
TeluguStop.com
చాలా మందికి సాయంత్రం అవ్వగానే స్నాక్స్ గుర్తొస్తాయి.సాయంత్రమనే కాదు లెండి కాస్త ఖాళీ టైం దొరికితే చాలు ఏం తిందామా, ఎక్కడికి వెళ్దామా అని చూస్తుంటారు చాలా మంది.
అందులో ఎక్కువగా సమోసా, బజ్జీలు అంటే పడి చస్తారు.అందుకే స్నాక్స్ టైం అయ్యిందంటే బజ్జీల బండి వద్ద, సమోసాల దుకాణాల వద్ద క్యూలు కట్టి మరీ లాగించేస్తుంటారు.
చిన్న చిన్న సమోసాలు అయితే ఓ పది, కొంచెం పెద్దవి అయితే నాలుగైదు.
మరీ పెద్దవి అయితే ఓ రెండు మూడు తింటుంటాం.కానీ మనం ఇప్పుడు చూడబోయే సమోసాను మాత్రం ఓ పదిమంది వరకు కలిసి తినాల్సి వస్తుంది.
ఏంటీ ఒకే సమోసాను అంద మంది ఎలా తింటారు అనుకుంటున్నారా.అవునండీ అది బాహుబలి సమోసా మరి.
దాని విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ వ్యాపారి.
బాహుబలి సమోసాను తయారు చేశాడు.అయితే మొత్తం 8 కిలోల బరువు ఉంటుంది.
మేరఠ్ లోని లాక్ కుర్తిలో స్నాక్స్ దుకాణం నడిపిస్తున్న అతడి పేరు శుభమ్ కౌశల్.
అయితే ఆయన దుకాణంలో సమోసాలు చాలా రుచింగా ఉంటాయట.ఎక్కువ మంది అక్కడ వాటిని తినేందుకు, కొనేందుకు ఇష్ట పడతారట.
దీంతో ఆయన ఓ పెద్ద సమోసా తయారు చేసి దానికి బాహుబలి అని పేరు పెట్టాడు.
దీని తయారీ 11 వందల రూపాయల ఖర్చు అయిందని వివరించాడు.అంతే కాదండోయ్ ఈయన చేసి బాహుబలి సమోసా రికార్డును మరోసారి ఆయనే బ్రేక్ చేయాలనుకుంటున్నాడు.
అందుకోసం ఈసారి 10 కిలోల బరువు ఉన్న సమోసా తయారు చేయాలనకుంటున్నట్లు ఆనందంగా చెప్తున్నాడు.
మహాకుంభ్ మోనాలిసా సంచలనం.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిన వైరల్ గర్ల్?