ఎనిమిది మంది బెట్టింగ్ రాజాల అరెస్టు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలో క్రికెట్,రమ్మీ, లోగన్ కప్పు ఆటలపై ఆన్లైన్లో బెట్టింగ్ పెడుతున్న 8 మందిని హుజూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

హుజూర్ నగర్,మేళ్లచెర్వు, విజయవాడ,రాయినిగూడెం గ్రామానికి చెందిన షేక్ ఖలీముద్దీన్,పొట్టి కోటయ్య, షేక్ అయూబ్ పాషా, పొట్టేపంగు కాటయ్య,తోడేటి గోపీకృష్ణ, తిరుమలశెట్టి రామ్మోహన్ రావు,సామల నర్సింహారెడ్డి,వాడపల్లి నర్సింహారావు కొంతకాలంగా ఆన్లైన్లో ఐపీఎల్ మ్యాచ్లకు బెట్టింగ్ పెడుతున్నారన్న పక్కా సమాచారంతో వారిపై నిఘా ఉంచి అరెస్ట్ చేసినట్లు, వారి నుంచి 8 సెల్ఫోన్లు, రూ.

3,400 నగదు సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.