సాగిన చర్మాన్ని టైట్ గా మార్చే ఎగ్ వైట్ మాస్క్
TeluguStop.com
ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు.అయితే సరైన
మార్గంలో వెళ్లి దాన్ని సాధించాలి.
ప్రతి చర్మ చర్మ సమస్యకి కంగారు
పడకుండా మన ఇంటిలో ఉండే సహజమైన పదార్ధలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
చర్మం వదులుగా మారితే వయస్సు ఎక్కువ వారీగా కనబడతారు.సాగిన చర్మాన్ని
టైట్ గా మార్చటానికి కొన్ని ప్యాక్స్ ఉన్నాయి.
వాటిని రెగ్యులర్ గా
ఉపయోగిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా
తెలుసుకుందాం.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక గుడ్డు తెల్లసొనలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్
వేయాలి.
ఈ ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ
విధంగా వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
!--nextpage
రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి.
ఈ
మిశ్రమన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి.ఈ విధంగా వారానికి
ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక బౌల్ లో ఒక గుడ్డు తెల్లసొన తీసుకోని దానిలో అరస్పూన్ మొక్కజొన్న
పిండి,అరస్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత
శుభ్రంగా కడగాలి.
ఈ విధంగా నెలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరిన
తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి ఒకసారి
చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?