అమెరికాలో పెరగనున్న కోడిగుడ్ల ధరలు .. జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్

తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటూ పోషకాహారంగా నిలిచిన కోడిగుడ్డు ధరలు( Egg Prices ) అగ్రరాజ్యం అమెరికాలో( America ) త్వరలో చుక్కలను అంటుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) ప్రకారం.2025లో కోడిగుడ్ల ధరలు దాదాపు 20 శాతంపైగా పెరుగుతాయని అంచనా.

మొత్తం ఆహార ధరలతో పోలిస్తే ఇది 2.2 శాతం .

వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా లేదా బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్లే కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని యూఎస్‌డీఏ తెలిపింది.

అయితే అమెరికా కొత్త ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్( Vice President JD Vance ) ఇంటర్వ్యూ తర్వాతే కోడిగుడ్ల ధరలు పెరుగుతుండటం చర్చనీయాంశమైంది.

ఇటీవల సీబీఎస్ న్యూస్‌లో ఫేస్ ది నేషన్ విత్ మార్గరెట్ బ్రాన్నాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.

గ్యాస్, కిరాణా ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.ట్రంప్( Trump ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఐదు రోజుల్లో.

బైడెన్ నాలుగేళ్లు చేసిన దాని కంటే ఎక్కువే సాధించారని వాన్స్ వ్యాఖ్యానించారు.ట్రంప్ జారీ చేసిన పలు కార్యానిర్వాహక ఉత్వర్వులు ధరలను తగ్గించడంలో సహాయపడతాయని వాన్స్ పేర్కొన్నారు.

అవి ఇప్పటికే మనదేశంలో ఉద్యోగాల కల్పనకు కారణమయ్యాయని , ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయగలిగేలా వేతనాలు కూడా పెరుగుతాయని జేడీ వాన్స్ చెప్పారు.

"""/" / కాగా.జనవరి 3న యూఎస్‌డీఏ అగ్రికల్చరల్ మార్కెటింగ్ సర్వీస్ (ఏఎంఎస్) దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌లలో, కిరాణా దుకాణాలలో రికార్డు స్థాయిలో అధిక ధరలు ఉన్నాయని నివేదించింది.

కోళ్లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌పీఏఐ)( Avian Influenza ) వ్యాప్తే దీనికి కారణమని పేర్కొంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.2022 జనవరి 17న ఈ వైరస్ అమెరికాలోని 50 రాష్ట్రాలలోని 136 మిలియన్లకు పైగా పౌల్ట్రీలను ప్రభావితం చేసింది.

"""/" / త్వరలోనే గుడ్ల ధరలలో భారీ పెరుగుదల చోటు చేసుకుంటుందని.డజను పెద్ద సైజ్ గ్రేడ్ ఏ గుడ్ల ధర గత డిసెంబర్‌లో 4.

15 డాలర్లుగా ఉండగా, ఇది నవంబర్‌లో 3.65గా ఉందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

బర్డ్ ఫ్లూ పౌల్ట్రీలపై ప్రభావం చూపకుండా పెంపకందారులు కోళ్లను రక్షించడానికి, గుడ్ల సరఫరా తగ్గకుండా చూడటాననికి 24 గంటలూ కష్టపడుతున్నారని అమెరికన్ ఎగ్ బోర్డ్ అధ్యక్షుడు సీఈవో ఎమిలీ మెట్జ్ ఇటీవల మీడియాకు తెలిపారు.

భారతీయులకు గుడ్ న్యూస్.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చని తెలుసా?