కోడిగుడ్డు , పెరుగుతో చుండ్రుకు గుడ్ బై....ఎలాగో తెలుసా?

చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు.ఎన్నో రకాల షాంపూలను ఉపయోగిస్తాం.

తాత్కాలికంగా తగ్గుతుంది.ఆ తరవాత మళ్ళీ చుండ్రు సమస్య మొదలు అవుతుంది.

అంతేకాకుండా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.మనకు అందుబాటులో ఉండే పెరుగు,కోడిగుడ్డును ఉపయోగించి చుండ్రు సమస్యను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

కోడిగుడ్డు + పెరుగు చుండ్రు సమస్య నుండి ఎలా తగ్గిస్తాయో వివరంగా తెలుసుకుందాం.

పెరుగు పెరుగులో ఉండే సహజ కొవ్వులు మాడును తేమగా ఉంచి పొడిగా మారకుండా చేస్తాయి.

దాంతో దురద తగ్గుతుంది.దురద తగ్గితే చుండ్రు కూడా తగ్గుముఖం పడుతుంది.

పెరుగులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తల మాడుపై దురదకు కారణం అయినకారకాలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

"""/"/ గుడ్డు గుడ్డులో సహజసిద్ధమైన ప్రోటీన్స్ ఉండుట వలన చుండ్రు తగ్గించటంలో సహాయపడుతుంది.అంతేకాక జుట్టు రాలకుండా బలంగా పెరగటానికి కూడా సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి ఒక కప్పు పెరుగులో ఒక గుడ్డు కలిపి తలకు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.

చుండ్రు సమస్యను పరిష్కరించటంలో కోడిగుడ్డు,పెరుగు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

వార్ 2 లో ఎన్టీయార్ ఎంత సేపు కనిపిస్తాడు..?