ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత ప్రసవాలు పెంచే విధంగా ఏఎన్ఎం లు కృషి చేయాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న అత్యాధునిక సేవలపై అవగాహన కల్పించి నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Anurag Jayanthi )ఆదేశించారు.

గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కేంద్రం పరిధిలోని 16 మంది ఏఎన్ఎం లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి( Government Hospital )లో ప్రసవాల సంఖ్య 71 శాతం ఉందని, మిషన్ 80 లో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.

సాధారణ ప్రసవాలతో కలిగే దీర్ఘకాలిక లాభాల పట్ల అవగాహన కల్పిస్తూ సిజేరియన్లకు కట్టడి వేయాలన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, వ్యాపించకుండా ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే లో కార్యక్రమం క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు.

ప్రజా ప్రతినిధులను, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.ప్రాథమిక కేంద్రం ఎన్క్వాస్ గుర్తింపు పొందడానికి అవసరమైన మరమ్మత్తులను చేపట్టాలని పంచాయితీరాజ్ ఏఈ కి సూచించారు.

ఆగష్టు 15 వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేయాలని అన్నారు.లింగన్నపేట, ముస్తఫానగర్ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు అయ్యాయని, ఒక్కో ఆరోగ్య ఉపకేంద్రం 20 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగుతుందని తెలిపారు.

వెంటనే పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవాలని పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు.

ఈ సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, ఉప వైద్యాధికారి డా.

శ్రీ రాములు, మెడికల్ ఆఫీసర్ డా.వేణుగోపాల్, పంచాయితీరాజ్ ఏఈ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా: నాని