ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) శాఖ బీజేవైఎం అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి( Jitender Reddy ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించడం జరిగింది.

పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథ(Midday Meal Scheme )కం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మండలంలో స్వీపర్లు లేని పాఠశాలల్లో వెంటనే స్వీపర్ పోస్టులను, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయ భర్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తక్షణ పరిష్కారం కోసం విద్యా వాలంటీర్లను నియమించి నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మానుక బాలకిషన్, సురేష్ యాదవ్, బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ నరేందర్ పటేల్, మండల బిజెవైఎం నాయకులు గంట చరణ్ గౌడ్ పొన్నం పవన్, ఓరగంటి చందు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

అన్నయ్యా.. నా గుండె బద్ధలైంది.. రవితేజ ఫ్యాన్ ఎమోషనల్ లెటర్ వైరల్!