మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

యాదాద్రి జిల్లా:చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

శుక్రవారం ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి బీజేపీ నాయకులను ఊరికించి కొడ్తా అని అహంకారంగా మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేదంటే మండలంలో తిరగనివ్వమని హెచ్చరించారు.మంత్రి అహంకార ధోరణి తగ్గించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇదేందయ్యా ఇది.. స్వర్గంలో మీటర్ స్థలం రూ.8,000… కొనుక్కోడానికి ఎగబడుతున్న జనం..?