గ్రూప్ – 1 పేపర్ లీకేజ్ కి నిరసనగా గంభీరావుపేట మండల కేంద్రంలో కేసీఆర్ కేటీఆర్ ల దిష్టిబొమ్మల దగ్ధం ……

గంభీరావుపేట: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ఆదివారం గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేసిఆర్ ,కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ గ్రూప్ వన్ పేపర్ లీకేజీ నూటికి నూరు శాతం ప్రభుత్వం యొక్క వైఫల్యమే.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటి శాఖ మంత్రి కేటీఆర్ లు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు , నిరుద్యోగులు మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశించి ఆనాడు ఉద్యమం చేయడం జరిగిందని,విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూసి చలించిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నేడు అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనక్కిన కేసీఆర్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి నేటి వరకు కూడా తన వాగ్దానాన్ని పూర్తి చేయలేదన్నారు.

గడిచిన 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది.

విద్యార్థులు నిరుద్యోగులు కలలుగన్న తెలంగాణను మట్టిలో కలిపి కేవలం కుటుంబ పాలనను దొరల పాలన కొనసాగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు నయా వంచన చేసిందన్నారు.

అదేవిధంగా గ్రూప్ వన్ పేపర్ లీకేజీలో మంత్రి మండలి లో ఉన్న మంత్రులకు మరీ ముఖ్యంగా కేటీఆర్ కి అదేవిధంగా కేటీఆర్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి బండారి తిరుపతికి ఇందులో హస్తముందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆరోపించారు.

కావున కేటీఆర్ వెంటనే తన తప్పును సరిదిద్దుకొని తన పదవి నుంచి తను స్వయంగా బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ చెందవద్దని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతరంపై విద్యార్థులపై , నిరుద్యోగులపై ఉందని సామాజిక తెలంగాణ ఉద్యోగాల తెలంగాణ కావాలంటే మరొక ఉద్యమం చేయక తప్పదని,దొరల గడీలలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తిని చేయాలంటే యావత్ తెలంగాణ యువతరం కదం తొక్కి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

పేపర్ లీకేజీ కి కారణమైన నిందితులను వెంటనే శిక్షించాలని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని తెలిపారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ తో పాటు ఎంపిటిసి పరుశరాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లచ్చయ్య, ఏడవైన ప్రభాకర్,విఠల్ గౌడ్, నుసరత్తుల్లా,వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు సత్యం,కిషన్ గౌడ్, మేడ భాస్కర్, జోగు సురేష్, సంజీవరెడ్డి, పాపా గారి రాజు, ఓరుగంటి నర్సింలు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గంగి స్వామి,యూత్ నాయకులు ఎగదండి మహేష్,సోషల్ మీడియా కన్వీనర్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు…కారణం ఏంటి..?