బెడ్ పై ఆ వర్క్ చేసేవారికి అలర్ట్.. పొంచి ఉన్న ముప్పు..!

కరోనా వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ గడుపుతున్నారు.ఈ విధానం వల్ల జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.

సాధారణంగా అయితే ఆఫీస్ డెస్క్ మీద కూర్చోని హాయిగా పనిచేస్తారు.కానీ ఇంట్లో అయితే బెడ్ మీద కూర్చోని పనిచేయాల్సి ఉంటుంది.

ఈ పద్దతి వల్ల అనేక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.ఈ విషయం పట్ల ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆఫీసుల్లోలాగా పనిచేయలేరు.ల్యాప్టాప్ లు ఒళ్లో పెట్టుకోని పనిచేస్తుంటారు.

సోఫాలు, మంచాలపై కూర్చోని పనిచేయడం అలవాటవుతోంది.అయితే సరైనటువంటి పద్దతిలో కూర్చోని పనిచేయకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ విషయాన్ని పరిశోధకులు తెలియజేశారు.మంచం మీద కూర్చోని పనిచేయడం వల్ల వారి శరీరం వంగి ఉండటంతో మెడ, వీపు, వెన్నెముక కు ఇబ్బందులనేవి తలెత్తుతాయి.

ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మానసిక ఆరోగ్యానికి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది.అంతేకాదు బెడ్ మీద కూర్చోని పని చేయడం వల్ల ఆత్మవిశ్వాసం అనేది చాలా వరకూ తగ్గిపోతుంది.

ఇది జీవితంపై చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.మామూలుగా అయితే బెడ్‌ రూమ్‌ లలో వెలుగు అనేది అంతగా ఉండకపోవడం, కిటికీలను సైతం మూసి ఉంచడం వల్ల సూర్య రశ్మి అందదు.

మంచం మీద పనిచేస్తే నిద్ర సమస్యలు తలెత్తుతాయి. """/" / వాటివల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది.

బెడ్‌ రూమ్‌ లో వెలుతురు తక్కువగా ఉండటం వల్ల ఆందోళన ఎక్కువవుతుంది.కళ్లు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడమే కాదు తలనొప్పి సమస్యలు వెంటాడుతాయి.

బెడ్ మీద కూర్చోని పనిచేయడం వల్ల దాంపత్య జీవనానికి అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి.

అంతేకాకుండా కదలకుండా పనిచేయడం వల్ల అధిక బరువు పెరుగుతారు.ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

బెడ్, మంచం మీద కూర్చోని పనిచేయడం వల్ల మెడ, చేతి, మణికట్టు నొప్పులు సైతం ఇబ్బందులు పెట్టొచ్చు.

Viral Video: ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌ లోకి చేయి పెట్టిన ఘనుడు.. చివరికి..?!