ఇంటికి వీధి పోటు ఉంటే ప్రాణ నష్టం తప్పదా..?
TeluguStop.com
వాస్తు శాస్త్రం( Vastu Sashtram ) ప్రకారం ఇంటికి వీధి పోటు ఉంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులలో భయం ఎక్కువగా ఉంటుంది.
ఇది మంచిది కాదని అశుభాలను తెస్తుందని ఇలా రకరకాల అపోహలు మనసులో ఉంటాయి.
అసలు ఈ వీధి పోటు( Veedhi Potu ) మంచిదేనా.దీని వల్ల ఎలాంటి పలితాలు వస్తాయి.
అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఏదైనా ఇల్లు ( Home ) కొనాలన్నా అందులో ఉండాలన్నా కూడా వీధి పోటు ఉందని తెలియగానే ఏదో కీడు జరుగుతుందని అనుకుంటూ ఉంటారు.
"""/" /
అసలు వీధి పోటు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి.నిజానికి అన్ని విధి పోటు ఇల్లు ప్రమాదకరం కాదు.
ముఖ్యంగా చెప్పాలంటే ఇంటికి ఎదురుగా వీధి ఉండడం, వీధి నుంచి డైరెక్ట్ గా చూపు ఇంటి మీద పడుతుంటే దానినే వీధి పోటు అంటారు.
ఇంటి విధి పోటు తూర్పున ఉంటే ప్రభుత్వంతో చిక్కులు వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఆగ్నేయంలో వీధి పోటు ఉంటే అనుకొని కష్టాలు వస్తాయి.
నైరుతిలో వీధి పోటు ఉంటే ఇంట్లోని వారికి మానసిక ఆందోళనలు ఎదురవుతాయి. """/" /
అంతేకాకుండా నైరుతి వీధి పోటు ఉంటే ఏ పని చేసినా అస్సలు ఫలితం ఉండదు.
ఉత్తర, వాయువ్యంలో వీధి పోటు ఉంటే ఇంట్లోని స్త్రీలకు తరచు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
వివాహాలు జరగడం, ఉద్యోగం రావడం కష్టమవుతుంది.కుటుంబంలో వారు అకాల మరణం చెందుతారు.
ఈ ఇంటి కుటుంబ సభ్యులకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు.ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమ నైరుతి వీధి పోటు ఇంట్లో నివసించే మగవారికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఇంకా చెప్పాలంటే సరైన వృత్తి లేక ఉన్న వృత్తిలో ఎదుగుదల లేక బాధపడతారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాస్తపరమైన కొన్ని మార్పులను చేసుకోవడం లేదా నివారణ చేసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
జుట్టును ఒత్తుగా పొడుగ్గా మార్చే దాల్చిన చెక్క.. ఎలా వాడాలంటే?