ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే.. వచ్చే ముప్పులు ఇవే?
TeluguStop.com
ఒత్తిడి.చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
నేటి కాలంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.ఒక్కోసారి ఊహించిన షాకింగ్ ఘటనలను కూడా ఫేస్ చేస్తుంటారు.
ఫలితంగా ఒత్తిడికి దారితీస్తుంది.అయితే చాలా మంది ఒత్తిడిని చిన్న సమస్యగా భావిస్తుంటారు.
కానీ, ఇదే మనిషి పాలిట శాపంగా మారి.ప్రాణాన్నే హరించేస్తుంది.
ఇక కొన్నిసార్లు తెలియకుండానే ఒత్తిడికి గురవుతుంటారు.ఆ సమయంలో కాళ్లు చేతులు వణకడం, చమటలు పట్టడం, జ్వరం రావడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే నిర్లక్ష్యం చేస్తూ ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే.అది ముదిరి డిప్రెషన్‌కు దారితీస్తుంది.
ఫలితంగా.తలనొప్పి, అలసట, చిరాకు, సంతోష సమయాల్లో కూడా ఆనందంగా ఉండలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
"""/" /
అలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపితే.హార్మోన్ లెవల్స్ క్రమంగా తగ్గిపోతాయి.
దాంతో కొన్ని జీవక్రియలు మందగించి రోజురోజుకి శరీరరం సహకరించకుండాపోతుంది.ఇక ఒత్తిడికి గుండెజబ్బులకు చాలా దగ్గర సంబంధం ఉంది.
ఒత్తిడిరి నిర్లక్ష్యం చేస్తూ.దానిలోనే ఉండిపోతే గుండె పోటు లేదా ఇతర గుండె సంబంధిత జబ్బులకు దారితీస్తాయి.
అలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపితే.జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడటం, అధిక రక్తపోటు, శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి, ఒత్తిడి సమస్య ఉన్న వారు.అనేక జాగ్రత్తలు తీసుకోవడం.
పోషకాహారం తీసుకోవడంమే కాదు.సమయానికి తినడం కూడా అలవాటు చేసుకోవాలి.
మరియు రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం, కంటి నిండా నిద్ర పోవడం, ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పాల్గొనడం వంటవి అలవాటు చేసుకోవాలి.
ఓలా స్కూటర్‌ను ధ్వంసం చేసిన ఓనర్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..