ఇలా శానిటైజర్ వాడితే.. రిస్క్‌లో ప‌డిన‌ట్టే..!!

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ క‌రాళ నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా అగ్ర‌రాజ్యంగా చెప్పుకునే అమెరికా క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోతోంది.దాదాపు మిగిలిన దేశాల్లోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక ఈ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో.అడ్డు అదుపు లేకుండా క‌రోనా విజృంభిస్తోంది.

ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.

అయితే క‌రోనా నుంచి ర‌క్షించేంద‌కు భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు వాడ‌డం య‌రియు శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం విప‌రీతంగా పెరిగింది.

దీంతో ఇప్పుడు ఎక్క‌డ‌ చూసినా.ప్ర‌తి ఒక్క‌రి ముఖానికి మాస్క్ మ‌రియు చేతిలో శానిటైజ‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ముఖ్యంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు చెప్ప‌డంతో.చాలా మంది శానిటైజర్లను విపరీతంగా వాడేస్తున్నారు.

అయితే శానిటైజర్లు క‌రోనాను నాశనం చేయ‌డానికి ఉపయోగపడుతున్నప్పటికీ.వాటిని అధికంగా వాడితే అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటున్నారు నిపుణులు.

ఎక్కువ‌గా శానిటైజ‌ర్లు యూజ్ చేస్తే.అర‌తుల్లోని చెడ్డ బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నాశానం అవుతుంది.

ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.

అలాగే శానిటైజర్లను ఓవ‌ర్‌గా యూజ్ చేస్తే చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ముఖ్యంగా మహిళల చేతులు సున్నితంగా ఉండడం వ‌ల్ల‌ తరచుగా శానిటైజర్‌ వాడినప్పుడు, చర్మం కందిపోయి, దద్దుర్లు, పొడిగా మార‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

కాబ‌ట్టి, శానిటైజర్ల‌ను అతిగా యూజ్ చేయ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.స‌బ్బు, మంచినీరు అందుబాటులో ఉంటే.

వాటితోనే చేతుల‌ను శుభ్రం చేసుకోవాల‌ని చెబుతున్నారు.సో.

బీకేర్‌ఫుల్‌!!.

యూఎస్: ఇయర్‌రింగ్ పోగొట్టుకున్న మహిళ.. స్థానికులు అందరూ కలిసి వెతకడంతో?