ఆలూ చిప్స్ తింటున్నారా.. అయితే ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి!
TeluguStop.com
ఆలూ చిప్స్ లేదా పొటాటో చిప్స్.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని అమితంగా ఇష్టపడి తింటుంటారు.
తింటుంటే.ఇంకా తినాలనిపించే ఈ ఆలూ చిప్స్‌ను సినిమా చూసినప్పుడు, జర్నీ చేసే సమయంలో, కాలక్షేపం కోసం, సాయంత్రం ఛాయ్‌తో పాటుగా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.
కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ ఆలూ చిప్స్‌ను పిల్లలైతే.లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు.
అయితే ఆలూ చిప్స్ రుచిగా ఉన్నాయి కదా అని.అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆలూ చిప్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిగిపోతుంది.
ఇక చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.గుండె పొటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
ఆలూ చిప్స్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.పైగా అనేక జబ్బులను కూడా తెచ్చి పెడతాయి.
ముఖ్యంగా ఆలూ చిప్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. """/"/
ఈ కొవ్వు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ఫలితంగా, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.అలాగే ఈ కరోనా సమయంలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఆలూ చిప్స్ తినడం వల్ల మీరు ఎంతో కష్టపడి బలపరుచుకున్న రోగ నిరోధక శక్తి బలహీన పడిపోతుంది.
దాంతో అనేక వైరస్‌లు, బ్యాక్టీరియాలు త్వరగా ఎటాక్ చేసేస్తాయి. """/"/
ఆలూ చిప్స్ తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు.
కాబట్టి, అధిక బరువు ఉన్న వారు, బరువు తగ్గాలని భావించే వారు ఆలూ చిప్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇక ఆలూ చిప్స్ తీసుకోవడం వల్ల.రక్త పోటు సమస్యలు కూడా తలెత్తుతాయి.
కాబట్టి, ఆలూ చిప్స్ అతిగా మాత్రం ఎప్పుడూ తినకండి.అతిగా కాదు అసలు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?