వంటల్లో `అజినోమోటో` వాడుతున్నారా.. అయితే ఈ చిక్కులు తప్పవు!
TeluguStop.com

అజినోమోటో.దీనినే మన భాషలో చైనా ఉప్పు అని పిలుస్తుంటారు.


రుచి కోసం చైనీయులు వంటల్లో అజినోమోటో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.మన దేశంలో సైతం దీని వినయోగం ఎక్కువగానే ఉంది.


ముఖ్యంగా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌లో అజినోమోటోను రుచి, వాసన కోసం విపరీతంగా వాడుతుంటారు.
ఇక ఇప్పుడిది అందరి వంట గదుల్లోకి కూడా వచ్చేసింది.చాలా మంది సాంబారు, ఫ్రైస్, సూప్‌లు, కూరల్లో కూడా అజినోమోటో వాడుతున్నారు.
అయితే వంటలకు రుచి పెరగడం పక్కన పెడితే.అజినోమోటో వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువే ఉన్నాయి.
అజినోమోటో వంటల్లో అతిగా వాడడం వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
గుండె కొట్టుకునే వేగాన్ని అజినోమోటో క్రమంగా తగ్గించేస్తోంది.ఫలితంగా.
గుండె పోటు లేదా ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ పెడుతుంది.
శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు అజినోమోటో తీసుకుంటే.వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
"""/"/
అలాగే అజినోమోటోను రెగ్యులర్ తీసుకోవడం వల్ల.చివరకు అది అలవాటుగా మారిపోతుంది.
ఒకవేళ ఇదే జరిగితే.అధిక బరువు, మధుమేహం, ఆస్తమా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక అజినోమోటోను అతిగా తీసుకుంటే.తలనొప్పి, క్రమంగా మైగ్రేన్ సమస్యకు దారితీస్తుంది.
అంతేకాదు, నాడీ వ్యవస్థపై అజినోమోటో తీవ్ర ప్రభావం చూపుతుంది.వంటల్లో తరచూ అజినోమోటో వాడితే.
నరాలు మొద్దుబారిపోవడం, మెడ నొప్పి, ముఖం మంటగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చే రిస్క్ పెంచడంలోనూ అజినోమోటో ఉపయోగపడుతుంది.ఇక కంటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసే సామర్థ్యం అజినోమోటోకు ఉంది.
అందువల్ల, ఈ అజినోమోటోను ఎప్పుడైనా తీసుకుంటే పర్వాలేదు.కానీ, రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
వైరల్ వీడియో: ఇంట్లోకి దూరిన పాము.. రెప్పపాటులో కూతుళ్లను కాపాడిన తల్లి.. నెటిజన్లు ఫిదా!