అల్లం టీ ఇలా తాగితే చాలా డేంజ‌ర్‌.. జాగ్ర‌త్త‌!

అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.ఘాటైన వాస‌న‌, రుచి క‌లిగి ఉండే అల్లంలో ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి.

అందుకే అల్లాన్ని ప్ర‌తి రోజు ఏదో ఒక‌ రూపంలో తీసుకుంటుంటారు.ముఖ్యంగా అల్లంతో త‌యారు చేసిన టీని రెగ్యుల‌ర్‌గా సేవించ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు.

ముఖ్యంగా ఈ వింట‌ర్ సీజ‌న్‌లో అల్లం టీ తాగ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, వైర‌ల్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా వంటి ఎన్నో స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

కండరాలు, కీళ్లనొప్పులు ఉన్న వారికి కూడా అల్లం టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అయితే అల్లం టీ ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.

అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.నేటి కాలంలో కొంద‌రు హై బీపీతో బాధ‌ప‌డుతుంటే.

కొంద‌రు లో బీపీతో ఇబ్బంది ప‌డుతున్నారు.అయితే లో బీపీ ఉన్న వారు అతిగా అల్లం టీ సేవిస్తే.

రక్త పోటు మ‌రింత ప‌డిపోయి నీరంగా మారిపోతార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. """/" / అలాగే అతిగా అల్లం టీ తీసుకుంటే.

అందులో అత్య‌ధికంగా ఉంటే యాంటీ ప్లేట్‌లెట్ గుణాలు రక్తస్రావానికి గుర‌య్యేలా ప్రోత్స‌హిస్తాయి.అందువ‌ల్ల‌, ఒక క‌ప్పుకు మించి ఎక్కువ‌గా అల్లం టీని తీసుకోరాదు.

ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు అల్లం టీ ఎంత త‌క్కువ తీసుకుంటే అంత మంచిది.అల్లం టీ లేదా అల్లాన్ని అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల మిస్ క్యారేజ్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది.

అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లకు అల్లాన్ని చాలా త‌క్కువ తీసుకోమ‌ని చెబుతుంటారు.

అల్లం టీ అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల‌పై సైతం తీవ్ర ప్రభావం ప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

కాబ‌ట్టి, అల్లం టీని మితంగా మాత్ర‌మే తీసుకోండి.ఇక అల్లం టీ అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల అతిసారం, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.