చిప్స్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
TeluguStop.com
మనకు టైం పాస్ కానప్పుడు.ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది.
అలా అనిపించినప్పుడు మన చుట్టూ ఏలాంటి స్నాక్స్ ఉన్నాయ్? ఏం ఉన్నాయ్ అని వెతుకుతాం.
ఇక పక్కన ఆలు చిప్స్, ఆనియన్ చిప్స్ కానీ పాప్ కార్న్ కానీ ఉన్నాయ్ అంటే ఆలోచించకుండా తినేస్తాం.
పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని తినడానికి ప్రతిఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు.సినిమా థియేటర్లకు వెళ్లిన సరే ఎక్కువ మంది చిప్స్ కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
మరికొందరైతే నిత్యం పాప్ కార్న్స్ తింటూ ఉంటారు.అయితే ఇలా ప్రతి నిత్యం తింటే ప్రమాదకరం అని అంటున్నారు కొందరు పరిశోధకులు.
ఎందుకు? ఏంటి అనేది మనం ఇప్పడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. """/"/
ఎంతో ఇష్టంగా పాప్ కార్న్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది.
పాప్ కార్న్, చిప్స్ లో వేసే మసాలాలు, ఉప్పు వల్ల అధిక బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, అధిక రక్తపోటు పెరగడం వంటివి ఎక్కువగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.
సాధారణంగా అయితే వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.కానీ ప్రస్తుత కాలంలో వాటి తయారీ విధానంలో మార్పులు చేయడం వల్ల వాటిలో వేసే మసాలాలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.
ఇక పాప్ కార్న్, చిప్స్ కానీ ప్యాకేజింగ్ కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!