తొక్క తీయకుండా అల్లం తీసుకుంటే చాలా డేంజరట!
TeluguStop.com
అల్లం.దీని గురించి పరిచయాలు అవసరం లేదు.
ముఖ్యంగా మన భారతీయులు అల్లంను రెగ్యులర్‌గా ఏదో ఒక రూపంలో వాడుతుంటారు.వంటల్లో, టీలో, ఉదయాన్నే తాగే వీడి నీటిలో ఇలా చాలా రకాలుగా అల్లాన్ని యూజ్ చేస్తుంటారు.
అంత విరివిరిగా ఉపయోగించే అల్లం ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా చేసే మేలు అంతా ఇంతా కాదు.
అనేక పోషకాలు నిండి ఉండే అల్లం.ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
అయితే అల్లం విషయంలో చాలా మంది ఓ పొరపాటు చేస్తుంది.అదేంటంటే.
తొక్క తీయకుండా అల్లాన్ని కడిగేసి ఉపయోగించేస్తుంటారు.కానీ, తొక్కతో అల్లాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా డేంజరంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకూ అంటే.అల్లం భూమిలో పెరుగుతుంది.
ఈ సమయంలో సూక్ష్మ జీవులు, కీలకాలు అల్లం లోపలికి చేరకుండా పైన ఉండే తొక్క అడ్డుకుంటుంది.
దాంతో పైన ఉండే తొక్కలో విష పదార్థాలు నిండి ఉంటాయి. """/"/
వాటిని ఎంత కడిగినా పోవు.
ఒకవేళ తొక్కతోనే అల్లం తీసుకుంటే.అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే తొక తీసి అల్లాన్ని ఉపయోగించుకోవాలి.ఇక తొక్క తీసి అల్లాన్ని రెగ్యులర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి.కాబట్టి, ఈ కరోనా మరియు చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అని అనుకునే వారు ప్రతి రోజు అల్లంను తీసుకోవాలి.
అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్‌తో ఇబ్బంది పడుతున్న మహిళలకు అల్లం గ్రేట్‌గా సహాయపడుతుంది.అల్లాన్ని రోజూ తీసుకంటే.
పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేలా చేయడంతో పాటుగా ఆ సమయంలో వచ్చే నొప్పిలను దూరం చేస్తుంది.
ఇక అల్లంను నీటిలో మరిగించి తీసుకుంటే.అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.
మరియు అల్లంను డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించి.
గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.
‘బైరవం’ సినిమాలో నారా రోహిత్ మంచు మనోజ్ క్యారెక్టర్లు ఏంటి..?