నిద్రించేముందు ఈ ఒక్కటి చేస్తే మీ జుట్టు రాలమన్నా రాలదు!

ఒత్తయిన జుట్టును కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా కోరుకుంటారు.జుట్టు ఒత్తుగా ఉంటే మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తారు అనడంలో సందేహం లేదు.

కానీ మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో చాలా మంది అధిక హెయిర్ ఫాల్( Hairfall ) తో తీవ్రంగా సతమతం అవుతున్నారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? వర్రీ వద్దు ప్రతి రోజు నైట్ నిద్రించే ముందు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను రాసుకుంటే మీ జుట్టు రాలమన్నా రాలదు.

మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు, నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఉసిరికాయ ముక్కలు, మెంతులతో పాటు మూడు టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పదార్థాలను వేసి చిన్న మంటపై ఉడికించాలి.

దాదాపు ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.

"""/" / రోజు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు బాగా పట్టించి కనీసం 10 నిమిషాలు అయినా మసాజ్ చేసుకోవాలి.

తద్వారా రక్త ప్రసరణ( Blood Circulation ) మెరుగుపడుతుంది.అదే సమయంలో జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.

హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది.ఫలితంగా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల వయసు పైబడిన కూడా మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.

ఇక‌ ఈ ఆయిల్ ను వాడేవారు ఖ‌చ్చితంగా మూడు రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవాలి.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్.. చూస్తే అవాక్కవుతారు…