చుండ్రు విపరీతంగా వేధిస్తుందా.. అయితే ఒక్క వాష్ లోనే వదిలించుకోండిలా!
TeluguStop.com
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో చుండ్రు( Dandruff ) ఒకటి.
వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, వాతావరణంలో వచ్చే మార్పులు, తలపై తేమ తగ్గిపోవడం తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య వేధిస్తుంటుంది.
అయితే కొందరిలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.ఇలాంటివారు చుండ్రును ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ సతమతం అయిపోతూ ఉంటారు.
డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే కనుక ఒక్క వాష్ లోనే చుండ్రు ఆల్మోస్ట్ మాయం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్(
Tea Powder ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్,( Fenugreek Powder ) అర కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరిగించాలి.
వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేయాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
"""/" /
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.
తద్వారా మంచి టోనర్ సిద్ధమవుతుంది.ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.
ఆపై స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు ఈ టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే ఒక్క వాష్ లోనే చాలా వరకు చుండ్రు పోతుంది.
ఒకవేళ చుండ్రు ఇంకా కనుక ఉంటే రెండు మూడు సార్లు ఈ హెయిర్ టోనర్ ను తయారు చేసుకుని వాడండి.
పూర్తిగా చుండ్రు వదిలిపోతుంది.పైగా ఈ టోనర్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.
దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.కాబట్టి చుండ్రు సమస్యతో సతమతం అవుతున్న వారే కాదు జుట్టు అధికంగా రాలిపోతుందని బాధపడుతున్న వారు కూడా ఈ టోనర్ ను వాడేందుకు ప్రయత్నించండి.
జలుబు నుంచి కీళ్ల నొప్పుల వరకు ఆవ నూనెతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?