ప్ర‌స‌వం త‌ర్వాత పొట్ట కొవ్వు త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్ మీ కోసం?

అమ్మ తనం అనేది ఎంత అద్భుత‌మైన‌దో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది.అందుకే పెళ్లైన ప్ర‌తి మ‌హిళా మాతృత్వం పొందాల‌ని కోరుకుంటుంది.

ఇక గ‌ర్భం దాల్చిన త‌ర్వాత ఎక్కువ ఆహారం తీసుకున్నా తీసుకోక‌పోయినా బ‌రువు పెర‌గ‌డం కామ‌న్.

అయితే ప్ర‌స‌వం త‌ర్వాత శ‌రీరమంతా స‌న్న‌బ‌డినా పొట్ట భాగంలో మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా క‌నిపిస్తుంది.

ఇక ఆ కొవ్వును క‌రిగించుకునేందుకు ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటారు అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే పొట్ట కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

సాధార‌ణంగా చాలా మంది ప్ర‌స‌వం త‌ర్వాత ఏ ప‌ని చేయ‌కుండా పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటారు.

కానీ, ఇది స‌రైన‌ది కాదు ప్ర‌స‌వం అయిన ఐదు లేదా ఆరు వారాల త‌ర్వాత నుంచి మెల్ల‌గా మెల్ల‌గా వాకింగ్ చేయ‌డం, చిన్న చిన్న ప‌నులు చేయ‌డం ద్వారా పొట్టు చుట్టు ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

నెల‌లు గ‌డిచే కొద్ది మ‌రి కొన్ని వ్యాయామాలు చేయ‌డం ప్రారంభించాలి. """/"/ అలాగే ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ యాల‌కుల పొడి మ‌రియు సోంపు వేసి బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత ఈ నీటిని వాడ‌గ‌ట్టుకుని ప‌ర‌గ‌డుపున సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే క్ర‌మంగా పొట్టు కొవ్వు క‌రుగుతుంది.

ఈ డ్రింక్ తాగ‌డం వ‌ల్ల మ‌రో అద్భుతమైన ప్ర‌యోజ‌నం ఏంటంటే త‌ల్లిపాలు కూడా పెరుగుతాయి.

ప్ర‌వ‌స‌రం త‌ర్వాత పొట్ట కొవ్వు తగ్గాలంటే ఒకేసారి ఆహారం తీసుకోరాదు.కొంచెం కొంచెం ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి.

"""/"/ అలాగే తృణ‌ధాన్యాలు, న‌ట్స్‌, పండ్లు, ఆకుకూర‌లు, తాజా కూర‌గాయ‌లు వంటివి ఎక్కువ‌గా తీసుకోవాలి.

ఇవి పొట్ట కొవ్వును క‌రిగిస్తాయి.వాట‌ర్ ఎక్కువ తీసుకోవాలి.

స్వీట్లు, చిరు తిండ్లు, కూల్ డ్రింక్స్‌, సోడాలు వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఇక ప్ర‌తి రోజు పొట్ట ద‌గ్గ‌ర నువ్వుల నూనె రాసి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి.

అనంత‌రం గోరువెచ్చ‌ని నీటితో కాపుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల పొట్ట భాగంలో సాగిన కండ‌రాలు టైట్‌గా మార‌తాయి.

కొవ్వు కూడా క‌రుగుతుంది.

కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే..!