మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!
TeluguStop.com
చిన్నా.పెద్ద అని తేడా లేకుండా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు.
ఇది సాధారణ సమస్య అయినప్పటికీ.నిర్లక్ష్యం చేస్తే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా కడుపు నొప్పితో పాటు పేగులను తీవ్రంగా నష్టపరుస్తుంది.అందుకే ఈ సమస్యను నివారించుకోవడం చాలా ముఖ్యం.
మరి ఈ సమస్య పోవాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మలబద్ధకం సమస్య తగ్గాలంటే.
పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.తద్వారా ఆహారం త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు.
సమస్య కూడా తగ్గుతుంది.ప్రతిరోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీరు తీసుకోవాలి.
మరియు ప్రతిసారి భోజనం చేయడానికి ముందు ఆ తర్వాత కూడా నీరు తీసుకోవాలి.
"""/" /
ఇక బెల్లం, నెయ్యి.ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నివారించుకోవచ్చు.
ఎందుకంటే.బెల్లంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అటు నెయ్యిలో మానవ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా లభిస్తాయి.
ఇవి డైజెషన్ స్మూత్ గా జరిగేందుకు ఉపయోగపడతాయి
అందుకే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత బెల్లంలో నెయ్యి కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే డైలీ డైట్‌లో పప్పు ధాన్యాలు, గింజలు, బ్రౌన్ రైస్, మొలకలు, కారేట్లు, బీట్‌రూట్లు, తోటకూర, గోంగూర, పాలకూర నిమ్మజాతికి చెందిన పండ్లు వంటివి చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఇక ఆయిల్ ఫుడ్స్, మసాలా వంటలకు దూరంగా ఉండాలి.
ఉద్యోగం మారారా..? అయితే పీఎఫ్ అకౌంట్ ను ఇలా చేయకపోతే నష్టపోవాల్సిందే!