వైట్ హెయిర్‌తో వ‌ర్రీ వ‌ద్దు.. వారంలో 2 సార్లు ఇలా చేసి చూడండి!

వైట్ హెయిర్ అంటే ఒక‌ప్పుడు ముసలితనంలో మాత్ర‌మే వ‌చ్చేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ఇర‌వై, ఇర‌వై ఏళ్లలోపు వారు సైతం తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు.

ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, అధిక ర‌క్త‌పోటు, త‌ర‌చూ హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను వినియోగించ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల త‌ల‌లో మెలనిన్ ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంది.

మెలనిన్ ఉత్ప‌త్తి త‌గ్గితే.న‌ల్ల జుట్టు కాస్త తెల్ల‌గా మారిపోతుంది.

అలాగే తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు త‌క్కువ వ‌య‌సులో తెల్ల జుట్టు వస్తే.వాళ్ల పిల్లలకు, మనవళ్లకు కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి.

కార‌ణం ఏదైనా తెల్ల జుట్టు మ‌న‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని, మ‌నోధైర్యాన్ని చంపేస్తుంది.దాంతో తెల్ల జుట్టుతో న‌లుగురిలోకి వెళ్లాలంటేనే జంకుతుంటారు.

ఆ జాబితాలో మీరు ఉంటే.అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్‌ను వారంలో రెండు సార్లు గ‌నుక రాసుకుంటే తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుతుంది.

మరి వైట్‌ హెయిర్‌ను నివారించే ఆ ఆయిల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

ముందుగా గ్లాస్ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు ఆవ నూనె, వ‌న్ టేబుల్ స్పూన్‌ మెంతుల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఇండిగో పొడి వేసుకుని బాగా క‌లుపుకుని మూత పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ను మ‌రుగుతున్న నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.

ఇలా హీట్ చేసుకున్నాక గ్లాస్ జార్ కూల్ అయ్యేంత వ‌ర‌కు క‌ద‌ప‌కుండా ప‌క్క‌న పెట్టేయాలి.

"""/" / ఆపై ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో గ్లాస్ జార్‌లోని ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.

బాగా మ‌సాజ్ చేసుకుని ప‌డుకోవాలి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టుకు బై బై చెప్పవచ్చు.

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో…