ప్రెగ్నెన్సీలో జుట్టు చాలా అధికంగా రాలుతుందా.. వర్రీ వద్దు ఇంట్లోనే ఈజీగా ఇలా చెక్ పెట్టండి!

సాధారణంగా మహిళల్లో డెలివరీ( Delivery ) అనంతరం హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

అలాగే కొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.అందులోనూ మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.

ఎందుకంటే ఆ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, కడుపు పెరిగే బిడ్డ హెల్తీగా ఉందా లేదా, ప్రసవం, ప్రసవం తర్వాత ఆరోగ్యం, బాడీ వెయిట్ ఇలా అనేక అంశాల గురించి ఆలోచిస్తూ బుర్రను పాడు చేసుకుంటారు.

ఈ క్రమంలోనే ఒత్తిడి పెరుగుతుంది.దీనికి తోడు హార్మోన్ల ప్రభావంతో జుట్టు ఓవర్ గా ఊడిపోతూ ఉంటుంది దీంతో ఏం చేయాలో తెలియక తెగ‌ సతమతం అయిపోతూ ఉంటారు.

కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

హెయిర్ గ్రోత్( Hair Growth ) కూడా రెట్టింపు అవుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

"""/" / అలాగే రెండు ఉసిరికాయలు తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు,( Onion Slices ) ఉసిరి కాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని పదినిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకే ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం ( Hair Loss )చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది.

హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

దాంతో మీ జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.

కొత్త కారును కొనుగోలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!