ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు వారంలో త‌గ్గాలా? అయితే ఈ రెమెడీ మీకోస‌మే!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపై న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి.మొటిమ‌లు, ఎండ‌ల ప్ర‌భావం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, పోష‌కాల కొర‌త ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌చ్చ‌లు ఏర్ప‌డి ముఖాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి.

ఈ క్ర‌మంలోనే వాటిని నివారించుకునేందుకు ఎన్నెన్నో ఖ‌రీదైన క్రీమ్స్‌, సీర‌మ్స్‌, జెల్స్ వంటి వాటిని యూజ్ చేస్తుంటారు.

అయినా త‌గ్గ‌క‌పోతే స్కిన్ కేర్ హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని పాటిస్తే వారం రోజుల్లోనే ముఖంపై ఏర్ప‌డిన న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గ‌డం ప్రారంభం అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

? చూసేయండి.ముందుగా చిన్న పైనాపిల్ తీసుకుని పీల్‌ను తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పేస్ట్ లా చేసుకుని.జ్యూస్‌ను మాత్రం వేరుచేసుకోవాలి.

ఇప్పుడు క‌ప్పు పైనాపిల్ జ్యూస్‌లో ఒక స్పూన్ శెన‌గ‌పిండి, ఒక స్పూన్ మొక్క‌జొన్న పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని డ‌బుల్ బాయిల‌ర్‌ మెథ‌డ్‌లో ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి.

చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఆపై ఇందులో ఒక స్పూన్ రోజ్ వాట‌ర్‌, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసి మిక్స్ చేసుకుని ఫిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.

"""/"/ ఇక దీన్ని ఎలా వాడాలంటే.నైట్ నిద్రించే ముందు గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేసి నిద్రించాలి.ఉద‌యాన్నే కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే న‌ల్ల మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి.మ‌రియు మొటిమ‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

టాలీవుడ్ స్క్రీన్‌పై మెరవనున్న సంతూర్ మమ్మీ.. ఆమె ఎవరంటే..?