మోచేతుల న‌లుపు ఇట్టే పోవ‌డానికి ఈ ఒక్క రెమెడీ చాలు..తెలుసా?

శ‌రీరం మొత్తం తెల్ల‌గా ఉన్నా.మోచేత‌ల వ‌ద్ద మాత్రం చాలా మందికి న‌ల్ల‌గా ఉంటుంది.

ఆ న‌లుపు కార‌ణంగా మోచేతులు వేరు పాటుగా మ‌రియు అందవిహీనంగా క‌నిస్తాయి.దాంతో మోచేతుల న‌లుపును వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఏవేవో స్క్ర‌బ్స్ ను వాడుతుంటారు.ర‌క‌ ర‌కాల క్రీములు, లోష‌న్లు రాస్తుంటారు.

అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలీక తీవ్రంగా స‌త‌ మ‌తం అయి పోతుంటారు.

అయితే మోచేతుల న‌లుపు ఇట్టే పోవ‌డానికి ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీ అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? మ‌రియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, వన్‌ టేటుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ బాదం నూనె, రెండు టేబుల్ స్పూన్ల‌ వైట్ టూత్ పేస్ట్‌, మూడు టేబుల్ స్పూన్ల ట‌మాటో జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మోచేతుల‌కు అప్లై చేసి ప‌ది నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత అర నిమ్మ చెక్క తీసుకుని.స్మూత్‌గా మోచేతుల‌ను స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకోవాలి.

ఆపై ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక న‌లుపు క్ర‌మంగా త‌గ్గి పోయి మోచేతులు తెల్ల‌గా, మృదువుగా మ‌రియు అందంగా త‌యారు అవుతాయి.

ఇక ఈ రెమెడీని మోచేతుల‌కే కాదు.పాదాల న‌లుపును, మెడ న‌లుపును వ‌దిలించుకోవ‌డానికీ ఉప‌యోగించ‌వ‌చ్చు.

అలాగే అండ‌ర్ ఆర్మ్స్‌లో డార్క్‌నెస్‌ను తొల‌గించ‌డం తోనూ ఈ రెమెడీ సూప‌ర్‌గా హెల్ప్ అవుతుంది.

కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

ఘనంగా నటుడు అర్జున్ చిన్న కుమార్తె నిశ్చితార్థం… అబ్బాయి ఎవరో తెలుసా?