వైట్ హెయిర్‌ను నివారించే సూపర్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఇదే!
TeluguStop.com
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో మానసికంగా మదన పెట్టే జుట్టు సంబంధిత సమస్యల్లో వైట్ హెయిర్ ఒకటి.
వయసు పైబడటం, పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వినియోగించడం వంటి కారణాల వల్ల కేశాలు తెల్లగా మారిపోతుంటాయి.
దాంతో వైట్ హెయిర్‌ను కవర్ చేసుకునేందుకు కలర్స్‌పై ఆధారపడుతుంటారు.అయితే న్యాచురల్ పద్ధతుల్లోనూ వైట్ హెయిర్‌ను నివారించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ సూపర్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటీ.
? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక పూర్తి గుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల బేబీ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
నాలుగు రోజులకు ఒక సారి ఈ రెమెడీని ట్రై చేస్తే గనుక తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
"""/"/
అంతే కాదు, పైన చెప్పిన సింపుల్ రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు రాలడం తగ్గు ముఖం పట్టి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
పొడి జుట్టు సమస్యతో బాధ పడే వారికి కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.
వారంలో రెండు సార్లు పైన చెప్పిన ప్యాక్‌ను వేసుకుంటే జుట్టు ఎల్లప్పుడూ స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంటుంది.
కాబట్టి, ఖచ్చితంగా ఈ రెమెడీని ప్రయత్నించండి.
ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఒక్క దెబ్బతోనే మాయం!