ఈ ఒక్క రెమెడీని ట్రై చేస్తే ఒత్తైన ఐబ్రోస్ మీ సొంతం!

ఒత్తైన ఐబ్రోస్ ముఖానికి మరింత వన్నెను తీసుకు వ‌స్తాయి.అందుకే ఐబ్రోస్ ప‌ల్చ‌గా ఉంటే.

ఒత్తుగా పెంచు కోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు ఐబ్రోస్‌పై చేయాల్సిన ప్ర‌యోగాల‌న్నీ చేస్తుంటారు.

ఖ‌రీదైన ఆయిల్స్‌, సీర‌మ్స్ వాడు తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని పాటిస్తే.

చాలా అంటే చాలా సుల‌భంగా ఐబ్రోస్‌ను ఒత్తుగా పెంచు కోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటీ.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసు కుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబులు స్పూన్ల గ్రీన్ టీ పొడి వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌ బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆలీవ్‌ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ మ‌రియు నాలుగు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రెండు నుంచి మూడు వారాల పాటు వాడు కోవ‌చ్చు.

ఇయ‌ర్ బ‌డ్ సాయంతో ఈ మిశ్ర‌మాన్ని ఐబ్రోస్‌పై అప్లై చేసు కోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గ‌నుక‌.

ఎంత ప‌ల్చ‌టి ఐబ్రోస్ అయినా ఒత్తుగా మరియు అందంగా పెరుగుతాయి.కావాలి అనుకుంటే కనురెప్పలకు కూడా దీన్ని వాడుకోవచ్చు.

ఈ రెమెడీ ఒత్తైన క‌నురెప్ప‌ల‌ను అందించ‌డం లోనూ అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.కాబట్టి, ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

 .