పాదాలు నల్లగా అసహ్యంగా మారాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రిపేర్ చేసుకోండిలా?

సాధారణంగా కొందరికి శరీరం మొత్తం తెల్లగా మెరిసిపోతున్నా.పాదాలు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.

మనలో చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.బయటకు బహిర్గతం అయ్యే శరీర భాగాల్లో పాదాలు కూడా ఒకటి.

అందుకే పాదాల‌ను తెల్లగా, మృదువుగా మెరిపించుకునేందుకు ఎక్కువ శాతం మంది ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి పెడిక్యూర్ చేయించుకుంటారు.

"""/" / కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పాదాలను రిపేర్ చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌ తీసుకునే అందులో మూడు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్‌ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, నాలుగైదు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemonade )వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై అర నిమ్మ చెక్కతో పాదాలను ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.

అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా తడి లేకుండా పాదాలను తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే పాదాలు ఎంత నల్లగా అసహ్యంగా ఉన్నా కూడా కొద్ది రోజుల్లోనే తెల్లగా మారుతాయి.

మృదువుగా మెరుస్తాయి.అందమైన తెల్లటి మెరిసే పాదాల్లో కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మరియు చాలామంది ఫేస్ కి, బాడీకి మాయిశ్చరైజర్ ను రాసుకుంటారు.పాదాలకు మరిచిపోతారు.

కానీ, నిత్యం పాదాలకు కూడా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.అప్పుడే పాదాలు డ్రై అవ్వకుండా తేమగా ఉంటాయి.

వైరల్ వీడియో: ఇంత సులువుగా చెపాతీలను చేసేయొచ్చా..?