బానపొట్టతో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగాల్సిందే!
TeluguStop.com
బాన పొట్ట.చాలా మందిని వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
శరీరంలో ఇతర భాగాలు సన్నగా ఉన్నా.పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.
బాన పొట్ట వల్ల బట్టలు పట్టకపోవడంతో పాటు అందహీనంగా కూడా కనిపిస్తారు.పైగా ఆరోగ్యానికి కూడా బాన పొట్ట ఏ మాత్రం మంచిది కాదు.
అందుకే బాన పొట్టను నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ డ్రింక్స్ ఉదయాన్నే తాగితే.
చాలా సులభంగా బానపొట్టను నివారించుకోవచ్చు.మరి ఈ డ్రింక్స్ ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో అదనంగా పెరుకుపోయి ఉన్న కొవ్వును కరిగించి.బాన పొట్టను నివారించడంలో మెంతుల నీరు అద్భుతంగా సహాయపడతాయి.
కాబట్టి, మెంతులను డ్రై రోస్ట్ చేసుకుని.పౌడర్‌లా చేసుకోవాలి.
ఆ పౌడర్‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.
ఈ డ్రింక్ కాస్త చేదుగా ఉన్నప్పటికీ.బాన పొట్టను తగ్గించడంలో సూపర్‌గా సహాయపడుతుంది.
"""/"/
పుదీనా డ్రింక్ కూడా బాన పొట్టను కరిగించగలదు.కొన్ని పుదీనా ఆకులను క్రష్ చేసుకుని.
ఒక గ్లాస్ వాటర్‌లో వేసి బాగా మరిగించాలి.అనంతరం ఈ వాటర్‌ను వడగట్టుకుని.
అందులో తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేసుకుని సేవించాలి.ప్రతి రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే.
మెటాబాలిజాన్ని వేగవంతం చేసి.పొట్ట చుట్టు కొవ్వును కరిగిస్తుంది.
"""/"/
ఇక దాల్చిన చెక్క మరియు మిరియాల కాంబినేషన్ కూడా బాన పొట్టను తగ్గిస్తుంది.
కాబట్టి, ఒక బౌల్‌లో ఒకటిన్నర్ గ్లాసుల వాటర్ పోసి.అందులో దాల్చిన చెక్క, మిరియాల పొడి, క్రాష్ చేసి అల్లం, నిమ్మరసం వేసి బాగా మరిగించుకోవాలి.
అనంతరం ఈ వాటర్‌ను వడగట్టుకుని.గోరువెచ్చగా అయిన తర్వాత తేనె మిక్స్ చేసుకుని తీసుకోవాలి.
ఈ డ్రింక్ ప్రతి రోజు తాగినా మంచి ఫలితం ఉంటుంది.
గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?