జ‌లుబు, ద‌గ్గు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? డోంట్ వ‌ర్రీ.. ఇలా చేయండి!

వ‌ర్షాకాలంలో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో జ‌లుబు, ద‌గ్గు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, వ‌ర్షాల్లో అధికంగా త‌డ‌వ‌టం, ఇమ్యూనిటీ సిస్ట‌మ్ దెబ్బ తిన‌డం వంటివి జ‌లుబు, ద‌గ్గుకు ప్ర‌ధాన కార‌ణాలు అవుతుంటాయి.

మిమ్మ‌ల్ని కూడా జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయా.? అయితే డోంట్ వ‌ర్రీ.

ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే చాలా అంటే చాలా సుల‌భంగా జ‌లుబు, ద‌గ్గును త‌రిమికొట్ట‌వ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా అంగుళం అల్లం ముక్క‌ను తీసుకుని పీల్ తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే చిన్న ఉల్లిపాయ‌ను కూడా తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో క‌ట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్క‌లు, హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు వేసుకుని.

బాగా మ‌రిగించాలి.నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట్రైన‌ర్ సాయంతో వాట‌ర్‌ను స‌ప‌రేట్ చేసుకుని వ‌న్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసుకోవాలి.

ఈ డ్రింక్ కంప్లీట్ గా కూల్ అయిన వెంట‌నే బాటిల్ లో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

ఈ డ్రింక్ ను వ‌న్ టేబుల్ స్పూన్‌ చ‌ప్పున మూడు పూట‌ల తీసుకుంటే.

ఎలాంటి జ‌లుబు, ద‌గ్గు అయినా ప‌రార్ అవ్వాల్సిందే. """/" / అంతేకాదు, ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో పైన చెప్పిన డ్రింక్ ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

ఊపిరితిత్తులు శుభ్రంగా మార‌తాయి.బాడీలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి.

పొట్ట వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు సైతం క‌రుగుతుంది.కాబ‌ట్టి, జ‌లుబు మ‌రియు ద‌గ్గు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారే కాదు ఎవ్వ‌రైనా ఈ డ్రింక్‌ను తీసుకోవ‌చ్చు.

ఫ్లెక్సీలు కట్టడానికి ప్లేసులు రిజర్వేషన్.. ఇదెక్కడి మాస్ క్రేజ్… ఎన్టీఆర్ కు మాత్రమే సొంతమా?