ఈ బాత్ పౌడ‌ర్‌ను వాడితే.. చ‌ర్మం మ‌ల్లెపువ్వులా మెరిసిపోతుంది!

అందం అంటే ముఖం మాత్రం తెల్ల‌గా, కాంతివంతంగా ఉంటే స‌రిపోదు.బాడీ మొత్తం కూడా ఉండాలి.

అందుకే చాలా మంది ఖ‌రీదైన సోప్స్ వాడుతుంటారు.అయితే వాటి వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఎన్ని ఉంటాయి అన్న‌ది ప‌క్క‌న పెడితే.

ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ బాత్ పౌడ‌ర్ మాత్రం మీ చ‌ర్మాన్ని మ‌ల్లెపువ్వులా మెరిపించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌పడుతుంది.

మ‌రి ఆ బాత్ పౌడ‌ర్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విష‌యాల‌పై ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల శెన‌గ‌పిండి, రెండు టేబుల్ స్పూన్ల చంద‌నం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ గులాబీ రేక‌ల పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ ప‌సుపు వేసుకుని అన్నీ క‌లిసేలా స్పూన్‌తో మిక్స్ చేసుకుంటే బాత్ పౌడ‌ర్ సిద్ధ‌మైన‌ట్లే.

దీనిని ఒక పొడి డ‌బ్బాలో నింపుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవ‌చ్చు. """/" / ఇక బాత్ పౌడ‌ర్‌ను ఎలా యూస్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల బాత్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని బాడీ మొత్తానికి ప‌ట్టించి.కాస్త ఆరిన అనంత‌రం వేళ్ల‌తో ర‌బ్ చేసుకుంటూ శుభ్రంగా స్నానం చేయాలి.

ఈ బాత్ పౌడ‌ర్ వాడితే సోప్ వాడాల్సిన అవ‌స‌రం లేదు.ఈ బాత్ పౌడ‌ర్ ను యూస్ చేస్తే మీ చ‌ర్మం మ‌ల్లెపువ్వు మాదిరి తెల్ల‌గా, అందంగా మ‌రియు ప్ర‌కాశ‌వంతంగా మెర‌వ‌డం ఖాయం.

ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే..?