Snake Venom : వీడియో వైరల్: మీరు ఎప్పుడైనా పాము విషం మనుషుల రక్తం పై ఎలా పనిచేస్తుందో చూశారా..?!

మనలో చాలామందికి పాము( Snake ) అనే పదం వినగానే శరీరం ఓ విధంగా భయభ్రాంతులకు లోనవుతుంది.

నిజానికి పామును చూస్తేనే చాలు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా వాటికి భయపడి పోతాము.

అవి చూడటానికి మన పరిమాణంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న వాటిని చూస్తే చాలు ఇట్లే భయపడిపోతాము.

దానికి కారణం ఒకవేళ పాము కాటు వేస్తే దాని నుంచి వెలువడే విషం కారణంగా మన ప్రాణాలు క్షణాలలో గాల్లో కలుస్తాయి.

ఇక అసలు విషయంలోకి వెళ్తే. """/" / అసలు పాము కాటు వేస్తే ఆ విషం( Snake Venom ) వల్ల మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు చెందుతాయో ఒకసారి చూద్దామా.

ఇలాంటి విషయం సంబంధించి ఓ వీడియో పాతదే అయిన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో చూస్తే ఓ వ్యక్తి ఓ విషపూరిత పామును( Poisonous Snake ) పట్టుకొని దానిని ఓ గాజు గ్లాస్ కు అదిమి పట్టేశాడు.

ఇలా పట్టుకున్న తర్వాత ఆ పాము కోరల్లో ఉన్న విషాన్ని గాజు గ్లాసులోకి తీసుకున్నాడు.

అలా తీసుకున్న తర్వాత పాముని పక్కన పెట్టేసాడు. """/" / అతడు సేకరించిన విషాన్ని ఓ సిరంజిలోకి నింపి ఆ తర్వాత పక్కనే ఉన్న గ్లాసులో మనిషి రక్తాన్ని తీసుకున్నాడు.

ఆ తర్వాత మనిషి రక్తం( Human Blood ) ఉన్న గ్లాసులోకి సిరంజిలో ఉన్న పాము విషాన్ని జత చేశాడు.

ఇంకేముంది క్షణాలలో ద్రవపదార్థంలో ఉన్న రక్తం కాస్త ఓ రాయిలా మారిపోయింది.దీన్ని బట్టి చూస్తే ఒకవేళ పాము మనిషిని కాటు వేస్తే ఆ విషం మనిషి శరీరంలో ఉన్న రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇట్టే అర్థమవుతుంది.

కాబట్టి పాములు ఉన్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.

బానిసత్వ పరిస్ధితుల్లో భారతీయ కార్మికులు : ఇటలీ పోలీసుల ఆపరేషన్‌లో 33 మందికి విముక్తి