ఊహ గానాలకు తెర దించుతారా ?

ఒకప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ( Bharatiya Rashtra Samithi )పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ( Etela Rajender )అనేక పరిణామాల తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు.

అప్పటినుంచి కేసీఆర్( KCR ) వ్యతిరేక రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యారు.తెలంగాణ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న బాజాపా లో చేరి కీలక నేతగా మారారు.

"""/" / బాజాపా కూడా ఆయనకు బాగానే ప్రాధాన్యత ఇచ్చింది అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారుతున్నట్లుగా, భాజపా ప్రాబల్యం తగ్గుతున్నట్లుగా వార్తలు వస్తుండటం, మరోపక్క బారసా విషయం కఠినం గా వ్యవహరించలేకపోవడం పార్టీకి మైనస్ గా మారింది అని బావిస్తున్నఈటెల పార్టీ మారబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి భాజపా తో అంతర్గత ఒప్పందంలో ఉన్నామని తెలంగాణలో మెజారిటీ ప్రజానీకం భావిస్తుందన్నవిషయాన్ని బాజాపా అధిష్టానానికి వివరించినప్పటికీ అధిష్టాన నుంచి సరైన స్పందన రానందున రాజకీయ భవిష్యత్తుపై వివిద వర్గాలతో సమాలోచనలు చేస్తున్నారట.

"""/" / మరోపక్క రాజగోపాల్( Rajagopal ) కూడా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి తో ఉన్నారు .

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్న ఈ నేతలు పార్టీ మారే దిశగా ఏర్పాటు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి .

ఎట్టి పరిస్థితిలోనూ కేసీఆర్ని గద్దె దింపాలనే బలమైన కోరికతో ఉన్న ఈ నేతలు అది భాజపా తో కుదరదని నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్ లోకి వెళ్లడానికి చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.

ఈ దిశగా మంగళవారం ఈటెల తన ఫ్యామిలీతో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది .

ఇందులో ఆయన సంచలన విషయాలు వెల్లడించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరోపక్క తెలంగాణ భాజపా అధ్యక్షుడ్ని ఢిల్లీకి పిలిపించుకున్న బాజాపా అధిష్టానం ఈ దిశగా కీలక చర్చలు జరుపుతున్నట్టు సమాచారం .

వీడియో: స్పెయిన్‌లో జలవిలయం.. వాహనాలు ఎలా కొట్టుకుపోయాయో చూస్తే..