Eesha Rebba : ఆ డైరెక్టర్ రెండు హిట్స్ ఇచ్చినా కెరీర్ నిలబెట్టుకోలేకపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరంటే..
TeluguStop.com
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలు తీస్తూ హిట్స్ కొట్టేవారు మాత్రమే కాదు విభిన్నమైన కథాంశాలతో డిఫరెంట్ సినిమాలు తీస్తూ హిట్స్ అందుకునే వారు కూడా ఉన్నారు.
అలాంటి వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ( Mohana Krishna Indraganti ) ఒకరు.ఒక డిఫరెంట్ మేకింగ్ స్టైల్‌తో తన సినిమాను ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా తీర్చిదిద్దడానికి ఆయన బాగా కృషి చేస్తాడు.
ఈ డైరెక్టర్ మొదటగా "గ్రహణం" అనే ఒక ఆర్ట్ ఫిల్మ్ అద్భుతంగా తీసి చాలామంది ప్రశంసలు అందుకున్నాడు.
ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కింది కానీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.
నిజానికి ఈ సినిమా తీయాలంటే ప్రతిభతో పాటు ధైర్యం కూడా ఉండాలి అవి రెండు ఈ దర్శకుడికి ఉన్నాయి.
"""/" /
మోహన కృష్ణ ఈ మూవీ తర్వాత మాయాబజార్, అష్టా చమ్మా వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
అయితే కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూసే స్టార్ హీరోల దృష్టిలో పడటానికి ఇలాంటి మామూలు హిట్ సినిమాలు సరిపోవు.
అందుకే ఈ దర్శకుడు రొమాంటిక్ కిల్లర్ మూవీ జెంటిల్ మేన్ తీశాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అనంతరం "అంతకముందు ఆ తర్వాత", సమ్మోహనం, అమీ తుమీ, వి లాంటి మూవీస్ డైరెక్ట్ చేశాడు.
వీటిలో కొందరు హీరోయిన్స్ ని రిపీట్ చేశాడు. """/" /
వారిలో క్యూట్ బ్యూటీ ఈషా రెబ్బ ( Eesha Rebba )కూడా ఉంది.
ఈ అందాల తార ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన "అంతకముందు ఆ తర్వాత", "అమీ తుమీ" సినిమా( Ami Thumi )ల్లో కనిపించింది.
ఇవి రెండూ కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి సక్సెస్‌లు అందించాయి.ఈ రెండు విజయాల తర్వాత ఈషా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ భావించారు.
కానీ ఆ సక్సెస్‌లతో వచ్చిన క్రేజ్ ను సరిగా వాడుకోవడంలో ఈ తార విఫలమైంది.
బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, అరవింద సమేత వంటి ఫ్లాప్ సినిమాలలో, అది కూడా సెకండ్ లీడ్‌గా చేయడానికి ఒప్పుకుంది.
ఏ ఇంపార్టెన్స్ లేని రోల్స్ ఎంపిక చేసుకొని ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది.
అంతేకాకుండా, దర్శక నిర్మాతల ఫోకస్ నుంచి బయటపడిపోయింది.కెరీర్ విషయంలో ఆమె చేసిన ఈ తప్పులే చివరికి అవకాశాలు రాకుండా చేశాయి.
కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ అమ్మడు మంచి హిట్స్ సాధించేది.కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా ఉండేది.
వచ్చిన అవకాశాలను అనాలోచితంగా ఓకే చేసి చివరికి తన కెరీర్ ను తానే సర్వనాశనం చేసుకుంది.
వరంగల్లో పుట్టి పెరిగిన అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈషా స్టార్ హీరోయిన్ గా ఎదిగి తెలుగు అమ్మాయిల అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని భావించినా ఆమె డిసప్పాయింట్ చేసింది.
ఈ తార ఫిజిక్ బాగానే ఉంటుంది, అందంగాను కనిపిస్తుంది.అన్నీ ఉన్నా ఈ తార సొంత తప్పులతో ఫెయిడ్ అవుట్ అయిపోయింది.