బాలీవుడ్ నటి హెయిర్ స్టైల్ పై దారుణంగా కామెంట్స్.. నూనె పెట్టుకో అంటూ!

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తరచూ ఏదో ఒక డిఫరెంట్ లుక్, హెయిర్ స్టైల్, విభిన్న వస్త్రధారణ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు వారి స్టైల్ ప్రేక్షకులను ఆకట్టు కోగా మరికొన్నిసార్లు వారు దారుణమైన పెట్రోలింగ్ కి గురవుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటి,సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే విషయంలో కూడా ఇలాగే జరిగింది.

ఒక వినూత్న ప్రయత్నం ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు నెటిజన్ల నుంచి చేదు అనుభవం ఎదురయింది.

దీపికా పదుకొనే ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశారు.హెయిర్ ఫ్లిప్ ట్రెండ్‌ను ప్రయత్నించిన ఆమె దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయానికి దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు గురైంది.

ఈ ఫోటోని షేర్ చేసిన దీపిక అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈహెయిర్ ఫ్లిప్ ట్రై చేశాను.

అయితే ఇది ఎపిక్ ఫెయిల్‌గా మారిందని వెల్లడించింది.ఇక ఈ పోస్ట్‌ పై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు స్పందిస్తూ.ఇన్ని రోజులు సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడ పెట్టారు.

ఆ డబ్బుతో కాస్త షాంపూ లేదా నూనె కొనుక్కోవచ్చు కదా అంటూ కామెంట్ చేయగా.

మరొక నెటిజన్ మాత్రం విద్యుత్ తీగలు పట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో అలా ఉంది అంటూ తన హెయిర్ స్టైల్ పై నెటిజన్లు విభిన్న శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం దీపికా పదుకొనేకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ జనజాతర సభ