యాదగిరిగుట్ట ఆలయ ఈఈ ఊడెపు రామారావు సస్పెండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఊడెపు రామారావును సస్పెండ్ చేసినట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈఈగా పనిచేస్తున్న ఊడెపు రామారావు అడ్డదారిలో ఉద్యోగం పొందాడని,అనేక విధాలుగా అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో విచారణ జరిపి ఆరోపణలు నిర్దారణ కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.

గతంలో ఇదే ఈఈ డ్యూటీలో నీలిచిత్రాలను చూడటం వల్ల సస్పెండైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే వేములవాడలో తోటి ఉద్యోగినితో పోలీసులకు పట్టుబడి సస్పెండ్ అయినట్లు సమాచారం.

ఈఈ ఉద్యోగ ప్రస్థానం అంతా అవినీతి మయంగా ఉందని,ఇప్పటికైనా వేటు వేయడం పట్ల భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నీరసం ఏ పని చేయనివ్వడం లేదా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!